23 July, 2026 | 1:48 AM

తిప్పనపల్లిలో కలుషితమవుతున్న తాగునీరు

23-07-2026 12:00 AM

చండ్రుగొండ, జులై22 ( విజయక్రాంతి ): మండలంలోని తిప్పనపల్లి యుపిఎస్ ఆవరణలో గల వాటర్ ట్యాంకు సమీపంలోని వాటర్ డైనేజ్ వాల్ వద్ద మంచినీరు కలుషితమవుతుంది. గత కొన్ని వారాలుగా నిత్యం నీరు లీకేజిల వల్ల వేలాది లీటర్ల త్రాగునీరు వాటర్వాల్ వద్ద మురుగునీటి గుంతగా మారి దుర్ఘంధం వెదజల్లుచూ, దోమలకు నిలయంగా మారింది.

అక్కడ ఉన్న వీధి, కాలనీ వాసులు దుర్ఘంధంతో అల్లాడుతున్నారు. పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని, రోజూ వేలాది లీటర్ల త్రాగునీరు మురుగుకాలువలోకి వెళ్తూంటుందని గ్రామస్తులు, కాలనీవాసులు పేర్కోంటున్నారు.

ప్రజలు స్వశ్చమైనా త్రాగునీరు అందించాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు ప్రవేటు వాటర్ సరఫరా దారులు(మంచినీటి అమ్మకం చేస్తే వ్యక్తులకు ) చెప్పిన్నట్లు చేస్తూ గ్రామంలో మంచినీటి సరఫరాను పట్టించుకోవడంలేదనే విమర్సలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్రాగునీటి కలుషితంపై తగిన చర్యలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు మంచినీటిని సరఫరా చేయించాలని గ్రామస్తులు కోరుచున్నారు.