18 August, 2026 | 12:29 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

సూర్యాతండలో చిన్న జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు

01-05-2026 02:18 PM

ప్రారంభించిన సర్పంచ్ బానోత్ రాందాస్ నాయక్

కారేపల్లి,విజయక్రాంతి: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ధరవత్ చిన్న నాయక్  జ్ఞాపకార్థంగా సూర్యాతండ గ్రామంలో చలివేంద్రం ను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బానోత్ రాందాస్ ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా ప్రయాణికులు, కూలీలు, స్థానిక ప్రజలు చల్లని తాగునీరు పొందుతూ ఎండ వేడిలో ఉపశమనం పొందుతున్నారు.

ప్రజల సేవే లక్ష్యంగా ఉచితంగా చల్లని నీటిని అందించడం ఈ చలివేంద్రం ప్రధాన విశిష్టత. చిన్న నాయక్ గ జ్ఞాపకార్థంగా ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం ద్వారా ఆయన సేవా భావాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.గ్రామ ప్రజలు ఈ చలివేంద్రాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో , పంచాయతీ కార్యదర్శి భార్గవి, ఉప సర్పంచ్ సునీత రవి, మాజీ ఎంపీటీసీ పార్వతి, వీరన్న,గౌతమ్, భూక్య హర్యానాయక్, వినోద్,హరిదాస్, చరణ్ ,ప్రసాద్, రవి ఠాగూర్, డాక్టర్ గిరిబాబు, శంకర్, చరణ్,  తదితరులు పాల్గొన్నారు.