సింగరేణి ఏరియాలో ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం
ఉత్తమ కార్మికులను శ్రమశక్తి అవార్డులు బహుకరణ..
కొత్తగూడెం,విజయక్రాంతి: కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ లో శుక్రవారం ఉదయం 141వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని, గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు మాట్లాడుతూ ,ముందుగా కార్మికులకు హృదయపూర్వక మే డే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా విభజించి ,కార్మిక హక్కులను హరించే విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శించారు. అలాగే 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన చారిత్రాత్మక పోరాటాన్ని, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆ కార్మికుల రక్త తర్పణంతో ఎగిరిన ఎర్రజెండా ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. కార్మిక హక్కులను హరించాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా ఎఐటియుసి యూనియన్ ఇచ్చే పిలుపుకు కార్మికులంతా ఏకమవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆర్‌సిహెచ్‌పి, సివిల్ , పివికే-5 గనులలో ఎఐటియుసి ఆధ్వర్యంలో, ఉత్తమ కార్మికులను ఎంపిక చేసి వారిని సన్మానించి “శ్రమశక్తి అవార్డు”లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరావు, గుమ్మడి వీరయ్య,పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, మధుకృష్ణ, ఏం ఆర్ కే ప్రసాద్,కమల్, సీనియర్ నాయకులు సురేందర్, సాయి పవన్, మురళి, బండి వెంకటరమణ, కొవ్వూరి రాజేశ్వరరావు,గంగారం,మెంగెన్ రవి ,కోటి,జోసెఫ్,ఏసుపదం,మండల రాజేశ్వరరావు, రమేష్, స్వదీప్, దేవసింగ్,ఇరప కృష్ణ, మహేందర్, రామచందర్, అవినాష్, వినయ్, సాగర్, అప్పారావు, కరుణాకర్,భాను ప్రసాద్, కోటయ్య ,అంకం రవి,తదితరులు పాల్గొన్నారు.






