బాల కార్మికులు లేని సమాజం కోసం కృషి చేయాలి
- బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్
నస్పూర్,(విజయక్రాంతి): బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కోరారు. శని వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మికులు లేని సమాజం ఏర్పడాలంటే ముందు బాలకార్మిక వ్యవస్థ నియంత్రణ జరగాలీ కాని ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసం విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే ఈ వ్యవస్థను నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు అన్నిప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ముఖ్యంగా ప్రజలు, స్వచ్చంద సంస్థలు ముందుకి రావాలన్నారు. బాల కార్మికులను గుర్తించి వసతి గృహాల్లో ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలన్నారు. బాల కార్మికులతో పని చేయిస్తే టోల్ ఫ్రీ నెంబర్(1098)కు సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో బాలల హక్కుల ప్రజా వేదిక ఉత్తర తెలంగాణ ఇంచార్జ్ బూట్ల శ్రీనివాస్, బాలల హక్కుల ప్రజా వేదిక మంచిర్యాల జిల్లా ఇంఛార్జీ బైరి చంద్రశేఖర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.






