4 July, 2026 | 7:18 PM

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి

04-07-2026 06:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగంలోని చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా బాలికలకు కొన్ని హక్కులు ఉంటాయని వాటిని పొందాలని సూచించారు. బాల్య వివాహం నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డానియల్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.