21 July, 2026 | 9:13 AM

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

20-07-2026 08:39 PM

- మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి 

- మన్సూరాబాద్ డివిజన్ వీకర్ సెక్షన్ కాలనీలో ఖాళీ బిందెలతో స్థానికుల ఆందోళన 

ఎల్బీనగర్: వానాకాలంలో తాగునీటికి ఇబ్బందులు పడడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి విమర్శించారు. మన్సూరాబాద్ డివిజన్ కాలనీల్లో నెలకొన్న నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్య నెలకొన్నది. సమస్యను పరిష్కరించాలని సోమవారం స్థానికులు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి స్థానికులతో మాట్లాడి, వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. వీకర్ సెక్షన్ కాలనీలో ఇండ్లకు సంబంధించిన బోర్లు అన్ని ఎండిపోయాయని తెలిపారు.  మంచినీరు కోసం ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వీకర్ సెక్షన్ కాలనీలో అత్యవసరంగా వాటర్ ట్యాంకర్లను పంపించాలని డిమాండ్ చేశారు. తన హయాంలో 2013లో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడం విచారకరమని, వెంటనే దానిని పునరుద్ధరించాలని అధికారులను కోరారు.