ఎంపీ లాడ్స్ నిధులతో తాగునీటి సమస్య పరిష్కారం
మేడిపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎంపీ లాడ్స్ నిధులతో బోరుబావిని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో చాలా కాలంగా ఉన్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ బోర్ బావి వేయడానికి నిధులు కేటాయించిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఎంపీ సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
అనంతరం సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి మాట్లాడుతూ, భగత్ సింగ్ కాలనీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు బోరు బావి ద్వారా శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని, ప్రజల అవసరాలపై స్పందించి నిధులు కేటాయించిన ఎంపీ ఈటెల రాజేందర్కు, పనులు ప్రారంభించిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డికి కాలనీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, సీపీఐ భగత్ సింగ్ కాలనీ కన్వీనర్ మహేశ్వరి, సీపీఐ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, సిపిఐ నాయకులు బొందయ్య, చంద్రయ్య, నరేష్, మహిపాల్, బీఆర్‌ఎస్ నాయకులు నరసింహ చారి, యాదగిరి, రామకృష్ణ, పవన్, మార్టిన్ పాల్గొన్నారు.






