కాంగ్రెస్ పాలనలో తాగునీటి ఇబ్బందులు
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
ఘట్ కేసర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ వద్ద దగ్గర ఎస్.వై.ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో సామల సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాగు నీరు సరఫరా అధ్వానంగా మారిందని ఆరోపించారు. గత కెసిఆర్ సారథ్యంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటి కష్టాలు లేవని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, బీఆర్‌ఎస్ రావాలని, మరోసారి కెసిఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
వేసవి నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు సామల సందీప్ రెడ్డి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈకార్యక్రమంలో ఎస్.వై.ఆర్ ట్రస్ట్ చైర్మన్ సామల యాదిరెడ్డి, మాజీ సర్పంచ్ లు పసుమాల కృష్ణ, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కొంతం వెంకట్ రెడ్డి వంగూరి శివకుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సామల బుచ్చిరెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, మీసాల రాజేష్, నీరుడి శ్రీనివాస్, ఎరుకల దుర్గరాజు గౌడ్, పులకంటి రాజశేఖర్ రెడ్డి, మంద స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.






