20 August, 2026 | 1:01 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ ఎమ్మెల్యే సండ్ర

20-08-2026 12:00 AM

ఖమ్మం ఆగస్టు 19(విజయక్రాంతి): ఖమ్మం నగరం, ఖానాపురం వాస్తవ్యులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గొడ్డేటి మాధవరావుఈశ్వరమ్మల కుమారుడు సాయికిరణ్ వివాహం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాస్తవ్యులు చందా శ్రీనివాస్మ్రాదేవిల కుమార్తె శ్రీవాణితో ఆగస్టు 16న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆగస్టు 19న మంగళవారం రాత్రి ఖమ్మంలోని రాజ రాజేశ్వరి కన్వెన్షన్లో రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ రిసెప్షన్ వేడుకకు బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య హాజరై నూతన వధూవరులు సాయికిరణ్, శ్రీవాణిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో నామ ఆప్యాయంగా మాట్లాడి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, తన్నీరు రవి, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, షారుఖ్ తో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.