20 August, 2026 | 2:43 AM

ఎమ్మెల్యే ఆదికి ఆచారవంతుల దీవెనలు

20-08-2026 12:00 AM

రుద్రంగి ఆగష్టు 19(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని ఆచారవంతుల సంఘం దగ్గర నూతన బోర్ మోటార్ కు భూమిపూజ చేశారు.సర్పంచ్ గండి నారాయణ,మార్కేట్ చై ర్మన్ చెలుకల తిరుపతి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఎర్రం గంగానర్సయ్య పాల్గొని బోర్ మోటార్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆచారవంతులు మాట్లాడుతూ.ఎమ్మెల్యే అయినంక వెంటన్నె మీకు ఇందిరమ్మ ఇండ్లు,కరెంట్,బోర్ మోటార్,ఇప్పిస్తా అని ఆది శ్రీనివాస్ మాట ఇచ్చిండు,ఇచ్చిన మాట ప్రకారం గెలిచి 8 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు మా సంఘానికి కరెంట్ ఇప్పిచ్చిండు ఇప్పుడు బోర్ మోటార్ కూడా ఇచ్చిండు మా ఆచారవంతుల దీవెనలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ఎల్లప్పుడూ ఉంటాయని ఇంకా మరెన్నో పదవులు ఆది శ్రీనివాస్ చేపట్టాలని ఆ ముక్కోటి దేవుళ్లను వేడుకుంటు పూజలు చేస్తామని తెలిపారు.