20 April, 2026 | 2:48 AM

పేదింటి కలలను నిజం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

20-04-2026 12:58 AM

మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేదింటి కలలను సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిజం చేశారని మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 298 వ డివిజన్ పూడూరు, కిస్టాపూర్ లో దగ్గు లత, రాములు దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహాప్రేశానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు గృహా సౌకర్యం కల్పించే గొప్ప సంకల్పంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజంగా పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వారు కొనియాడారు.  మేడ్చల్ మున్సిపల్ మాజి వైఎస్ చైర్మన్ సిహెచ్ రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉదండపురం సత్యనారాయణ, మాజి కౌన్సిలర్ లు జాకట దేవరాజు నాయకులు టి యాదయ్య, ఎఈ సుభాష్ రెడ్డి, పూడూరు సత్తిరెడ్డి, టి. సుధాకర్, కోటగిరి అశోక్, గణేష్, వేముల రంజిత్ రెడ్డి, ఆకాష్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.