11 కేవీ విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ (Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భానుప్రసాద్ అశోక్ (28), లేలాండ్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 7న గణేష్ ఉత్సవ నిర్వా హకుడైన శరత్ యాదవ్ కోరిక మేరకు ఘ నాపూర్ నుండి అల్వాల్కు విగ్రహాన్ని తరలించడానికి ఒప్పుకున్నాడు.
రాత్రి ౮:30 గంటల సమయంలో ఘనాపూర్ మండపం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రోడ్డుపై 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు వేలాడుతుండటాన్ని గమనించి, ప్రమాదం పొంచి ఉందని నిర్వాహకుడు శరత్ యాదవ్‌కు భాను ప్రసా ద్ తెలిపాడు. అయినప్పటికీ ఏంకాదు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పగా విగ్రహం వైర్లకు తగిలి వాహనమంతా విద్యు త్ ప్రవహించింది.
కిందికి దిగడానికి ప్రయత్నించిన భానుప్రసాద్ విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందు తూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మృతుడి తమ్ము డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.