3 August, 2026 | 1:35 PM

మెదక్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల నిరసన

22-06-2024 12:14 AM
  • పని ఒత్తిడి ఎక్కువైందని ఆవేదన

మెదక్, జూన్ 21 (విజయక్రాంతి): మెదక్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పని భారం ఎక్కువ కావడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ సుమారు 60 మంది డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నామని, డిపో మేనేజర్ సుధ, సీఐ నెల రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

ఇంటి వద్ద కూడా సరిగా ఉండలేకపోతున్నామని, హోటళ్లలో భోజనం చేసి డిపోలో పడుకొని డ్యూటీ చేస్తున్నామని వాపోయారు. విశ్రాంతి లేని డ్యూటీ చేయడంతో పది మంది డ్రైవర్లు అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ఒక ట్రిప్పుకు అదనంగా మరో ట్రిప్పు డ్యూటీ వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే, డిపో అధికారులు మాత్రం డ్రైవర్లపై అధిక పని భారం ఏమీ లేదని, ఆర్టీసీ నిబంధనల మేరకు పని చేయాల్సిందేనని చెబుతున్నారు.