3 August, 2026 | 2:28 PM

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

03-08-2026 01:22 PM

రాహుల్ గాంధీ అశోక్ నగర్ గడ్డపై ఇచ్చిన హామీకే దిక్కులేదు

అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎం.. రేవంత్ రెడ్డే క్రిమినల్ వేస్ట్ 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లే క్రిమినల్ వేస్ట్

హైదరాబాద్: యూత్ డిక్లరేషన్ల పేరిట ప్రచారంతో కాంగ్రెస్ ఊదరగొట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్(Job Calendar) విడుదల చేసిందని సూచించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండేళ్లయినా.. జాబ్ లు భర్తీ(Job recruitment) చేయలేదని విమర్శించారు. జాబ్ లు భర్తీ  చేయకపోవడంతో సూసైట్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

20 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. 7 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారా? అని ప్రశ్నించారు.  2 లక్షల ఉద్యోగలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అశోక్ నగర్ నడిరోడ్డులో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన హామీకి దిక్కులేదని విమర్శించారు. ఉద్యోగాలు అడిగితే.. ఎండ్రిన్ తాగి చావాలని సీఎం అంటున్నారని ధ్వజమెత్తారు.ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను క్రిమినల్ వేస్ట్ అని సీఎం అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. నిరుద్యోగులు ఎండ్రిన్ తాగి చావాలని రేవంత్ రెడ్డి అంటుంటే.. రాహుల్ స్పందించరా?, యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది.. ఒక్కటైనా నెరవేర్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కరోనా వచ్చినా.. జోనల్ వ్యవస్థను కేంద్రం అడ్డుకున్నా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ కు తెలంగాణలో జరిగేవి కనపడవా? అన్నారు. ఎక్కడ ఏం జరిగినా స్పందించే రాహుల్ గాందీ తెలంగాణలోని అంశాలపై ఎందుకు స్పందించరన్నారు. అత్యధిక క్రిమినల్ కేసులు ఉ్న సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) క్రిమినల్ వేస్ట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చదివారో కూడా తనకు డౌటే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ నింపుకోగలుగుతారా?, అసలు విద్యార్థుల గురించి రేవంత్ రెడ్డి ఏం తెలుసు?, రేవంత్ రెడ్డి ఒక్క ఇంటర్వ్యూకైనా వెళ్లారా?, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు, ఎలా ఇస్తారో చెప్పాలి? అని కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.