3 August, 2026 | 12:33 PM

మహిళల రక్షణే ధ్యేయం

22-06-2024 12:18 AM
  • మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు

15 రోజుల్లో 111 మంది పోకిరీల అరెస్టు

రాచకొండ సీపీ తరుణ్‌జోషి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : బాలికలు, మహిళల రక్షణ కల్పించడమే తమ ధ్యేయమని, వారిని వేధించే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ డా.తరుణ్‌జోషి హెచ్చరించారు. శుక్రవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలోని రాచకొండ ఉమెన్స్ సేఫ్టీ వింగ్, షీటీమ్స్ ఆధ్వర్యంలో 111 మంది ఈవ్‌టీజర్లకు వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 15 వరకు ఫోన్ ద్వారా 26, సోషల్‌మీడియా ద్వారా 34, నేరుగా 95 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 9 క్రిమినల్ కేసులు, 57పెట్టి కేసులు నమోదు చేశామని, 54 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.