బైక్ రేసర్లపై కేసు నమోదు
- 89 బైక్‌లు సీజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): నగరంలో బైక్, కార్ రేసింగ్‌కు పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. వారి నుంచి 89 బైక్‌లు, 2 కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు మాదాపూర్ డివిజన్ ఏసీపీ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 1న టీహబ్, నాలెడ్జిసిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి సమీపంలో రోడ్లపై అరుస్తూ, బైక్ రేసింగ్‌కు పాల్పడి భయానక వాతావరణం సృష్టించిన యువకులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
వారందరినీ 2వ తరగతి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా లక్ష రూపాయల పూచీకత్తుపై విడుదల చేశామని, మరోసారి పునరావృతం అయితే రూ. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. బైక్ రేసుల పట్ల తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో ఉంచుకోవాలని కోరారు. బైక్ రేస్‌లకు ఎలాంటి అనుమతి లేదని, అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.






