బీజేపీ విద్వేష వైఖరి దేశానికి ప్రమాదకరం
నల్లగొండలోడీసీసీ అధ్యక్షుడు పున్న
నల్లగొండ టౌన్, 14 ఆగస్టు : బిజెపి విద్వేష వైఖరి దేశానికే ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాస నేత అన్నారు.ఉత్తరాఖండ్ హల్ద్వానీలో రాంలీలా మైదానాన్ని బీజేపీ నేతలు ‘శుద్ధీకరణ‘ పేరుతో పాలతో కడగడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సత్యాగ్రహ ర్యాలీ జరిగింది. క్లాక్ టవర్ నుండి డీ ఈఓ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డి సీసీ అధ్యక్షుడు కైలాష్ నేత మాట్లాడుతూ, ‘స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అయినా బీజేపీ ఇంకా కుల-మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తోంది. ఇది దేశ సమైక్యతకు ప్రమాదం. రాజ్యాంగాన్ని గౌరవించని ప్రధాని మోడీ, అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి‘ అని డిమాండ్ చేశారు.హల్ద్వానీలో మసీదులు, దేవాలయాలు, చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని చెప్పారు. 12 ఏళ్ల బిజెపి పాలనలో ఆదానే అంబానీలకు దోచిపెట్టడమే తప్ప దేశంలో పేదలు బీదలకు ఒరిగిందేమీ లేదన్నారు.
రైల్వే ఎల్‌ఐసి బిఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటుపరం చేసిందని ఆరోపించారు. దేశంలో యువత తిరుగుబాటు మొదలైందని బిజెపికి దేశంలో చరమగీతం పాడుతారు అన్నారు.కార్యక్రమంలో* OBC సెల్ అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, SC సెల్ చైర్మన్ బోడ స్వామి, మండల అధ్యక్షులు చింత ధనుంజయ్, ఎడ్ల ప్రవీణ్, జిల్లా నేతలు ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.






