10 April, 2026 | 3:17 AM

భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీనే కీలకం

10-04-2026 01:20 AM

ఫ్రొఫెసర్ ఎన్ ఉషారాణి

‘విజ్ఞాన్స్’లో ముగిసిన ‘డ్రోన్ టెక్నాలజీ’పై వర్క్‌షాప్ 

హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, వైద్య రంగం, సర్వేలు, డెలివరీ సేవలు.. ఇలా అన్ని రంగాల్లోనూ డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని గుంటూరులోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్, రిసోర్స్‌పర్సన్ ఎన్. ఉషారాణి అన్నారు. విద్యార్థులు ఈ ఆ ధునిక సాంకేతికతను నేర్చుకోవడం ద్వారా మంచి కెరీర్ అవకాశాలు పొందవచ్చని చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదా న్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘డ్రోన్ టెక్నాలజీ: డిజైన్, ఆపరేషన్, రియల్ టైమ్ అప్లికేషన్స్’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల ప్రత్యేక వర్క్‌షాప్ గురువారం ఘనంగా ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో తొలి రోజు డ్రోన్ల ప్రాథమిక సూత్రాలు, యూఏవీ సిస్టమ్స్‌పై ఫ్రొపెసర్ ఉషారాణి, డాక్టర్ పి.వెంకట సు బ్బారావు అవగాహన కల్పించారు.రెండో రోజు ఫ్లైట్ కంట్రోలర్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో పాటు డ్రోన్ అసెంబ్లీపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చి ఫ్లైయింగ్ సెషన్ నిర్వహించారు. మూడో రోజు డ్రోన్ ప్రోగ్రామిం గ్, డీజీసీఏ నిబంధనలు, అడ్వానస్డ్ ఫ్లైట్ ట్రైనింగ్‌తో వర్క్‌షాప్ ముగిసింది.

ఫ్రొఫెసర్ ఉషారాణి మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదని.. వ్యవసాయం, వైద్యం, రక్షణ రం గాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నా రు. విద్యార్థులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఇక క్యాంపస్‌లో ‘డ్రోన్ టెక్నాలజీ క్లబ్’ను అధికారికంగా ప్రా రంభించడమే కాకుండా, పరిశోధనలను ప్రోత్సహించేందుకు సి-డాక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమె ప్రకటించారు. దీనివల్ల అత్యాధునిక పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుందన్నారు. 

డ్రోన్ టెక్నాలజీతో అపార అవకాశాలు: ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు

ప్రస్తుత ఆధునిక కాలంలో ‘డ్రోన్ టెక్నాలజీ’ అనేది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక అపారమైన అవకాశాల గని అని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు చెప్పారు. భవిష్యత్తులో ప్రతి రంగం లోనూ డ్రోన్ల వినియోగం తప్పనిసరి కాబోతోందన్నారు. ఈ కీలక మార్పును గుర్తించే, విజ్ఞాన్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ‘డ్రో న్ టెక్నాలజీ క్లబ్’ను ఏర్పాటు చేశామన్నారు.

సి-డాక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మనం కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విద్యార్థులు అత్యాధునిక సాంకేతికతపై ప్రయోగాత్మక శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులు ఇక్కడే తమ స్వహస్తాలతో డ్రోన్ల ను తయారు చేసి, వాటిని ఆపరేట్ చేస్తూ ప్రపంచస్థాయి ఆవిష్కర్తలుగా ఎదగడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో పా ల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధి పతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.