అరేబియా సముద్రంలో 'క్రిస్టల్ మెత్' స్వాధీనం
29-11-2024 10:04 AM
న్యూఢిల్లీ: భారత నౌకాదళం, శ్రీలంక నౌకాదళం సంయుక్త ఆపరేషన్‌లో అరేబియా సముద్రంలో రెండు పడవలలో సుమారు 500-కిలోల మాదకద్రవ్యాలను (క్రిస్టల్ మెత్) స్వాధీనం చేసుకున్నాయి. రెండు పడవలు, సిబ్బందితో పాటు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు అప్పగించారు.






