15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

17-11-2025 01:49 AM

పట్టుబడ్డ 468 మంది మందు బాబులు

శేరిలింగంపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు  కొరడా ఝుళిపిస్తున్నారు.శనివారం రాత్రి 16 పిఎస్ లిమిట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 468 మంది మద్యం సేవించిన వారు చిక్కారు. ఇందులో 335 టూ వీలర్స్, 25 త్రీ వీలర్స్,107 ఫోర్ వీలర్స్, 1 హెవీ వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు,ఇతరుల ప్రాణాలకు కారణమైన వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం, 105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.