17-11-2025 01:48:02 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 16: గుర్తుతెలియనివ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియనిమృతహాన్ని గుర్తించామని తెలిపారు.
బొంగ్లూరు సమీపంలో ఔటర్ ఎగ్జిట్ 12 నుండి ఆదిబట్ల వెళ్లే సర్వీస్ రోడ్డు పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల నుండి సమాచారం రావడంతో ఆదిభట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్లూస్ టీం సాయంతో వివరాలను సేకరించడం జరిగిందన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మహేశ్వరం జోన్ అదనపు డీసీపి సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపి రాజు, అధిబట్ల సిఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.