17-11-2025 01:50:45 AM
మొయినాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి): గత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బాగంగా ఇచ్చిన హమిని నేటికి కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ మాజీ ఎంపీటీసీ మోర శ్రీనివాస్. వివరాలో కి వెళ్ళితే మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెం దిన మోర శ్రీనివాస్ గత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బాగంగా తనను గెలిపిస్తే గ్రామానికి చెందిన ఆడపడుచుల పెళ్లికి పుస్తెమెట్టెలను కీ.శే మోర శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇస్తానని హామీనిచ్చారు.
హామీలు భాగంగా ప్రజా ప్రతినిధిగా తన పదవి ముగిసిన సైతంప్రజలకు ఇచ్చిన మాట నేటికి అమలు చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆదివారం గ్రామానికి చెందిన జంగయ్య, పద్మ దంపతుల కుమార్తె నందిని పెళ్లి ఉండడం తో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోర శ్రీనివాస్ ఆ కుటుంబం ను తన ఇంటికి ఆహ్వానించి ఆడబిడ్డ పెళ్లికి పుస్తెమెట్టెలను అందజేశారు.
గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిలకు పుస్తెమెట్టెలను అందించే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్బంగా మోర శ్రీనివాస్ తెలిపారు. గ్రామ ప్రజలకు సేవా చేసే అదృష్టం తనకు రావడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ప్రజాసేవలో సంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు