కంచర్ల గ్రామంలో డ్రై డే ఫ్రై డే కార్యక్రమం
28-02-2026 02:43 AM
భిక్కనూర్, ఫిబ్రవరి27(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కంచర్ల గ్రామంలో సర్పంచ్ గొల్ల అరుణ స్వామి ఆధ్వర్యంలో డ్రై డేఫ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామ వీధులు, పరిసరాలను శుభ్రం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామంలో నాటిన చెట్లకు నీరు పోసి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొని గ్రామ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.




