calender_icon.png 16 May, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్ప్రవర్తనతో మెదలండి

15-05-2025 07:23:04 PM

రౌడీ షీటర్లకు డీఎస్పీ సూచన...

తొర్రూర్: రౌడీ షీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని సత్ప్రవర్తనతో మెదలాలని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్(DSP Krishna Kishore) సూచించారు. మహబూబాబాద్ జిల్లా  తొర్రూర్ సర్కిల్ పరిధిలోని  ఐదు మండలాలకు సంబంధించిన రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లలకు తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సత్ప్రవర్తన కలిగి గత కొన్ని సంవత్సరాలుగా ఏలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను డీఎస్పీ పరిశీలన అనంతరం సిఫారసుల మేరకు జిల్లా ఎస్పీ వారిపై ఉన్నటువంటి షీట్లను తొలగించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... ఏలాంటి కేసులలో ఇన్వాల్వ్ కాకుండా మంచి ప్రవర్తనతో ఉన్నట్లయితే వాటిని పరిశీలించి భవిష్యత్తులో మరికొంతమందిపై ఉన్న రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎలాంటి అలజడలు సృష్టించకుండా మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరగాలని ఈ సందర్భంగా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ సిఐ టీ.గణేష్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ఉపేందర్, రమేష్ బాబు, రాజు, సురేష్, క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.