15-05-2025 07:32:04 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నూతన పట్టణ కార్యవర్గం ఎన్నికైన శుభ సందర్భంగా వారికి పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Sri Alleti Maheshwar Reddy) ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టం బలోపేతం కోసం తమవంతుగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా ఒల్లెపు తిరుపతి, రావుల విట్టల్, మగ్గిడి భూమేష్ వడ్నాల రాము ప్రధాన కార్యదర్శులుగా కొండా జి శ్రావణ్ కార్యదర్శులు వెంకట్ కందుల రవి, గంజి రాము, దోమకొండ రాకేష్ తో పాటు 45 మంది పట్టణ కమిటీ సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.