15-05-2025 06:44:40 PM
బైంసా (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel) అన్నారు. గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రాంటేక్ గ్రామంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 24 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
అదేవిధంగా మండపం, షెడ్డు కోసం ఐదు లక్షల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తక్షణమే ఆలయం వద్ద బోరు బావి వేయిస్తానన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సాగౌడ్, మాజీ జడ్పీటీసీ సంవ్లీ రమేష్, తదితరులు ఉన్నారు.