20-12-2025 11:47:45 PM
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్‌ఆర్ బిల్డర్స్ గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ది ట్విన్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న జంట భవనాల్లోని 16 వేల చదరపు అడుగులు విలాసవంతమైన మోడల్ ఫ్లాట్ ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాత శేషగిరిరావు, డిఎస్‌ఆర్ ఎండి డి. రఘురామిరెడ్డి, సంస్థ వ్యవస్థాపకులు డి. అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ గా దీనిని చెబుతున్నారు. మొదటిసారిగా ఒక ఫ్లోర్‌లో కేవలం ఒక్క యూనిట్ 15,999 చదరపు అడుగులు మాత్రమే ఉండేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
ఐకానిక్ ట్విన్ టవర్స్ ఆకృతిలో, సహజమైన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఆధునిక కర్వ్‌డ్ ఆర్కిటెక్చర్‌తో దీనిని నిర్మించారు. నివాసితుల సౌకర్యం కోసం ప్రపంచ ప్రసిద్ధ 'షిండ్లర్' హై-స్పీడ్ ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. విలాసమంటే కేవలం ఆడంబరం మాత్రమే కాదనీ, సౌకర్యంతో పాటు క్వాలిటీ కూడా ఉండాలన్నదే తాము నమ్ముతామని డిఎస్‌ఆర్ వ్యవస్థాపకులు డి. అభిషేక్ రెడ్డి చెప్పారు. దీర్ఘకాలం పాటు అత్యున్నత జీవన ప్రమాణాలను ఆస్వాదించాలనుకునే వారి కోసం 'ది ట్విన్స్'ను నిర్మించామని తెలిపారు. హైదరాబాద్ స్కైలైన్‌కే గర్వకారణంగా నిలిచే ఈ ప్రాజెక్ట్, విలాసవంతమైన గృహ నిర్మాణ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుందిని చెప్పారు.