calender_icon.png 21 December, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ ఏఐ సదస్సు థింక్ ఐ2025 విజయవంతం

21-12-2025 12:00:00 AM

మోయినాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంపై విస్తృత ప్రభావం చూపబోతుందని, ఆ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కోనేరు లక్ష్మణ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు లక్ష్మణ్ హవీష్ అన్నారు. మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ గ్రామ రెవెన్యూలో ఉన్న కేఎల్‌ఎమ్ డీమ్డ్ యూనివర్సిటీలో గత రెండు రోజులుగా ఏఐ ఆధారిత సాంకేతికతల్లో తాజా ధోరణులు అనే అంశంపై నిర్వహించిన మూడవ అంతర్జాతీయ సద స్సు థింక్ ఐ2025 ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పరిశోధన మరియు ఆవిష్కరణలపై విస్తృత చర్చలు జరిగాయి.

భారత్తో పాటు విదేశాల నుంచి ప్రముఖ అకాడమిషియన్లు, పరిశ్రమ నిపుణులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక పరిశోధనలతో పాటు అనువర్తిత ఏఐ ఆవిష్కర ణలపై లోతైన విశ్లేషణలు జరిపారు. సదస్సులో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ & సిగ్నల్ ప్రాసెసింగ్, సాఫ్ట్ కంప్యూటింగ్, ఏఐ ఆధారిత అనలిటిక్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, హెల్త్కేర్ మరియు స్మార్ట్ సిటీల్లో ఏఐ వినియోగం, నైతిక మరియు బాధ్యతాయుత ఏఐ వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్ర మంలో ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ బి. యోగ్ననారాయణ, జోయిర్ ఎర్త్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ అమిత్ వర్మ, డాక్టర్ సుబ్రజిత్ సతపథి, డాక్టర్ ఎస్కే అల్తాఫ్, డాక్టర్ కృష్ణయ్య తదితరులు పాల్గొని కీలక అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోనేరు లక్ష్మణ్ హవీష్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఏఐ అభివృద్ధిని దిశానిర్దేశం చేయడంలో విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. రామకృష్ణ, కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.