20 June, 2026 | 2:35 AM

డుప్లెసిస్ విధ్వంసం

20-06-2026 12:00 AM

మేజర్ లీగ్ క్రికెట్

డల్లాస్, జూన్ 19 : సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 41 ఏళ్ల వయసులోనూ తన క్రికెట్ జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో డుప్లెసిస్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఫాఫ్.. సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యా చ్‌లోవిధ్వంసం సృష్టించాడు.  ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. డుప్లెసిస్ కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

అతడితో పాటు రుసో 49, ముల్డర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా సూపర్ కింగ్స్ టార్గెట్‌ను కేవలం 4 వికెట్లు మాత్రమే కో ల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ సెంచరీ చేశాడు. ఛేజింగ్‌లో డుప్లెసిస్ విధ్వంసంతో సూపర్ కింగ్స్ ఈజీగా గెలిచింది. కాగా ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్-2026 సీజన్‌లో పాల్గోనలేదు. వేలానికి ముందే అతడు తప్పుకొన్నాడు.