వరల్డ్ కప్ నుంచి శ్రేయాంకా ఔట్
ప్రేమా రావత్‌కు చోటు
ముంబై, జూన్ 19 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా శ్రేయాంక పాటిల్ గాయంతో మెగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు శ్రేయాంక గాయం ఎదురుదెబ్బగానే చెప్పాలి. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె గాయపడింది.
ఫీల్డింగ్ చేసే క్రమంలో శ్రేయాంక కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంట నే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలికి తీసుకుని వెళ్లారు.
ఆ తర్వాత స్కానింగ్ రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలు కునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. శ్రేయాంక స్థానంలో ఎంపికైన ప్రేమా రావత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎ ల్లో తన లెగ్- స్పిన్‌తో ఆకట్టుకుంది. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ తరఫున కూడా రాణించింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా భారీ విజయాలు సాధిం చిన భారత జట్టు గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.






