18-01-2026 08:59:41 PM
సిద్దిపేట: జిల్లా శ్రీ కూడవెల్లి పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారిని దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నరు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. దుబ్బాక నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.