18-01-2026 09:06:38 PM
భక్తులకు అన్నదానం నిర్వహించిన పబ్బ స్వరూప రాణి రమేష్ గుప్త కుటుంబ సభ్యులు.!!
ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!!!
శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలో కొలువై వెలసిన భగలాముఖి శక్తిపీఠం దేవాలయంలో మాఘ అమావాస్య కావడంతో దేశ నలుమూలల నుంచి పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున రావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. మాఘా అమావాస్య సందర్భంగా భగలాముఖి శక్తిపీఠం ఆలయంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, వామన శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గల యాగశాలలో ప్రత్యేక యజ్ఞం నిర్వహించి భగలాముఖి అమ్మవారికి అర్చన మహా మంత్ర హవనం మహా పూజ విశేషపూజలు పంచామృతాలతో అభిషేకం ఆరిద్రార్చన హవనం, పూర్ణాహుతితో పూజలు ముగించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర శర్మ, వామన శర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో నేను బాగుండకున్న పరవాలేదు కానీ ఇంకొకరు బాగుండకుంటే బాగుండని చెడు కోరే మన శత్రువులు ఉన్నారని శివ్వంపేట భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వారి శత్రువుల నాలుకలు పట్టుకొని శత్రువు చెడు మాటలను మనకు నష్టం కలిగించే మాటలను స్తంభింపజేసి భక్తులకు ఎలాంటి ప్రతి బాధలు కలగకుండా వాటిని తొలగింపజేసే శత్రుకారిని స్తంభ దేవత శ్రీ భగలాముఖి అమ్మవారిని భగలాముఖి వ్యవస్థాపకులు ట్రస్ట్ అధ్యక్షులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ అన్నారు. అమ్మవారిని దర్శించిన భాగ్యం వల్ల కలిగే మోక్ష ఫలితాలను పుణ్యఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పబ్బ స్వరూపారాణి రమేష్ గుప్తా కుటుంబ సభ్యులు
భగలాముఖి శక్తి పీఠం స్థలదాత పబ్బ రమేష్ గుప్తా తల్లిదండ్రులు పబ్బ రామమ్మ అంజయ్య గుప్త జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజు న ట్రస్ట్ సభ్యులు శివ్వంపేట మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆలయ దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా మాట్లాడుతూ... అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని బగలాముఖి అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందని మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్ , మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు,పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.