calender_icon.png 18 January, 2026 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే

18-01-2026 08:56:14 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నెంబర్ -1లో  కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటిసారిగా ఆగడం జరిగింది. సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి రైలుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... 30 సంవత్సరాల సిర్పూర్ నియోజకవర్గం ప్రజల కోరిక నెరవేరిందని, ఈ హాల్టింగుకు కృషిచేసిన ఆదిలాబాద్ ఎంపీ  గొడం నగేష్  ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ రైలు హాల్టింగ్ వలన కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన కేరళ సమాజం వారికి, ప్రత్యేకించి అయ్యప్ప స్వామి దీక్షపరులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు.అలాగే తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్లే వారికి ఈ ట్రైన్ ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.అనంతరం రైలు పైలట్ కు సిబ్బందికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.