2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

17న క్రీడా పాఠశాల ప్రవేశాల ఎంపికలు

14-03-2026 06:19 PM

సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం సిద్దిపేట రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈ నెల 17న ఉదయం 9 గంటలకు చింతమడకలోని కెవిఆర్ఎస్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి కొత్త రాజిరెడ్డి తెలిపారు.

ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం, బోనఫైడ్, ఆధార్ కార్డు, గత సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (5), కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 10×6 షటిల్ రన్, 800 మీటర్ల పరుగు అంశాల్లో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు: 9440478436, 9704061543.