16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దుద్దిళ్ల శీను బాబు

10-06-2025 12:00 AM

మంథని (విజయక్రాంతి): జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సోదరుడు దుద్దిళ్ల శీను బాబును నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీను బాబుకు మంథని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు శీను బాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని శీను బాబు తెలిపారు.