11-05-2025 12:01:30 AM
ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘లవ్ టుడే’ తో వచ్చిన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘రిట ర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో తమిళం, తెలుగు భాషల్లో పాపులరిటీ సాధించుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తమిళం, -తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది.
కీర్తీశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యూత్‌ను ఆకట్టుకునేలా ‘డ్యూడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
టైటిల్ అనౌన్స్‌మెంట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్‌లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించారు. ఇదే ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.