calender_icon.png 12 May, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైమ్ థ్రిల్లర్ కథకళి

11-05-2025 12:02:19 AM

బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్‌లో ప్రసన్నకుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్ న్యూఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కథకళి’. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూజాకార్యక్రమాలతో శనివారం ప్రారంభమైంది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. హర్షిత్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్‌కు డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించారు. మధు దామరాజు, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పవన్ మ్యూజిక్ అందిస్తుండగా, జితిన్ మోహన్ డీవోపీగా, నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.