calender_icon.png 14 May, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాభారతంలో అనాథ.. వీరచంద్రహాస

11-05-2025 12:00:12 AM

కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా సంచలనం సృష్టించారు రవి బస్రూర్. ఆయన దర్శకత్వంలో ‘వీర చంద్రహాస’ చిత్రం రూపొందింది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించగా, శిథిల్‌శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

హోంబలే ఫిల్మ్స్, ఓంకార్ మూవీస్ బ్యానర్లపై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను తెలుగులో కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంవీ రాధాకృష్ణ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌సేన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

మహాభారతంలోని అశ్వమేధిక పర్వం నుంచి రూపొందిన చిత్రమిది. ఇదొక అనాథ బాలుడి గొప్పతనాన్ని చెబుతోందీ కథ. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.

ట్రైలర్ రిలీజ్  సందర్భంగా నిర్మాత ఎంవీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. “ఇటీవల కన్నడలో  విడుదలైన ‘వీరచంద్రహాస’ మంచి వసూళ్లను రాబడుతోంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికీ బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా” అన్నారు.