17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా దురిశెట్టి అనుదీప్

12-06-2025 11:30 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా దురిశెట్టి అనుదీప్ నియమితులయ్యారు, గురువారం రాష్ట్ర ప్రభుత్వం 36 ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు(Chief Secretary K Ramakrishna Rao) బదిలీల ఉత్తర్వుల జాబితాను విడుదల చేశారు. అనుదీప్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పని చేసిన హాయంలో సమర్థవంత అధికారిగా మంచి గుర్తింపు పొంది ఉన్నారు. 2017 సివిల్ సర్వీస్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 2018లో తొలి విడతగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు.

ఆ తదుపరి 2021 సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా కొనసాగారు. అనంతరం అక్కడనుండి 2023 లో హైదరాబాద్ కలెక్టర్గా బదిలీ పై వెళ్లారు.  అనుదీప్ స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్ పల్లి   విద్యాభ్యాసం బిట్స్ పిలాని నుండి ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టభద్రుడు. గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఖమ్మం కలెక్టర్ ముజమిల్లా ఖాన్ ను సివిల్ సప్లై డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ముజ మిల్లా ఖాన్ జిల్లా లో సమర్థవంతంగా పనిచేసి అన్ని విభాగల్లో అభివృద్ధి కి కృషిచేశారు.