17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పోక్సో కేసులో వృద్ధుడికి ఐదేళ్ల శిక్ష

13-06-2025 12:00 AM

కార్వాన్, జూన్ 12: మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాకార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసు వివరాలను లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకటరాములు గురువారం మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని నానల్ నగర్ ఖాదర్ బాగ్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ముస్తఫా హుస్సేన్ 2018 సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆసిఫ్ నగర్ డివిజన్ ఏసిపి చక్రవర్తి (రిటైర్డ్) కేసు విచారణ జరిపి నాంపల్లిలోని 12వ అడిషనల్ సెషన్స్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అనిత గురు వారం తీర్పు వెల్లడించారు. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

అదేవిధంగా 1000 రూపాయల జరిమా నాను నిందితుడు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే మూడు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉం టుందని న్యాయమూర్తి వెల్లడించిన్నట్లు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకట రాములు పేర్కొన్నారు. ఈ కేసును అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్ రెడ్డి వాదించారు. కోర్టు విధులు సక్రమంగా నిర్వర్తించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించేలా చర్యలు తీసుకున్న కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు.