1 July, 2026 | 7:39 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •  

దసరా బొనాంజా

18-10-2024 02:50 AM

రీంనగర్, అక్టోబరు 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజయన్ పరిధిలోని 11 డిపోలకు దసరా వేడుకల సందర్భంగా నడిపిన బస్సులకుగాను రూ.31.50 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 1 నుంచి 16 వరకు, అక్టోబర్ 2, 12 తేదీలకు మినహాయిస్తే మిగతా రోజుల్లో కరీంనగర్ రీజియన్‌కు ఈ ఆదాయం సమకూరింది. మొత్తం 53.32 లక్షల కిలోమీటర్ల ప్రయాణం కొనసాగగా, 31.50 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా నమోదయ్యింది. మొత్తం 61 లక్షల 11వేల 849 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఇందులో మహాలక్ష్మి కింద 42 లక్షల 34 వేల 542 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో ఆదాయం సమకూరింది. గోదావరిఖని డిపోకు 5 కోట్ల 27 లక్షల 45 వేల రూపాయల ఆదాయం సమకూరగా, రెండవ స్థానంలో కరీంనగర్ డిపో నిలిచింది. కరీంనగర్ డిపోకు 4 కోట్ల 22 లక్షల 19వేల రూపాయల ఆదాయం సమకూరింది. తర్వాత జగిత్యాల డిపోకు 4 కోట్ల 21 లక్షల 74 వేల రూపాయల ఆదాయం సమకూరింది. కరీంనగర్ డిపోకు 3 కోట్ల 38 లక్షల 36వేల ఆదాయం సమకూరింది. 

అత్యల్పంగా సిద్ధిపేట జిల్లా..

అత్యల్పంగా సిద్ధిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ డిపోకు ఆదాయం సమకూరింది. ఈ డిపోకు కోటి 43 లక్షల 42వేల రూపాయల ఆదాయం సమకూరింది. మంథని డిపోకు కోటి 83 లక్షల 91వేల ఆదాయం సమకూరింది. హుజూరాబాద్ డిపోకు అక్యుపెన్సీ శాతం 107 శాతం లభించగా, మెట్‌పల్లికి 106 శాతం లభించింది. 99 శాతం దక్కించుకున్న డిపోల్లో సిరిసిల్ల, కోరుట్ల ఉన్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం కరీంనగర్ జిల్లా పరిధిలో.. కరీంనగర్‌ొో1, కరీంనగర్ హుజూరాబాద్ డిపోలు ఉండగా, పెద్దపల్లి జిల్లా పరిధిలో.. గోదావరిఖని, మంథని డిపోలు, జగిత్యాల జిల్లా పరిధిలో.. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో.. సిరిసిల్ల, వేములవాడ, సిద్ధిపేట జిల్లా పరిధిలో.. హుస్నాబాద్ డిపో ఉన్నాయి.