04-10-2025 12:00:00 AM
-జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు
-జమ్మి పంచుతూ, ఆలింగనం చేసుకున్న ప్రజలు
-పాలపిట్టల పిట్టను దర్శించుకున్న ప్రజలు
-వేడుకల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రముఖులు
నకిరేకల్, అక్టోబర్ 3 : నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా సంబరాలు గ్రామ గ్రామాన అంబరాన్నంటాయి. షమీ పూజలు, రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కోరికలను జమ్మి చెట్టుకు సమర్పించుకున్నారు. జమ్మి పంచుతూ, ఆలింగణం ఒకరికొకరు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకున్నారు, దుర్గమాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్త బట్టలు ధరించి బాణాసంచాలు పేల్చి కుటుంబ సమేతంగా విజయదశమిని గడిపారు. ఆయుధ పూజలు నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ ఆలయాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సమేతంగా సందర్శించి పటేల్ నగర్ లో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, నాయకులు చామల శ్రీనివాస్ ,పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో ..
నకిరేకల్, అక్టోబర్ 3: విజయదశమి సందర్భంగా వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వైశ్యభవనంలో అలా య్ బలాయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ గుండా నరేందర్ మా ట్లాడుతూ అందరం కలుసుకొని ఆత్మీయ ఆలింగనం ద్వారా మానవ సంబంధాలు, స్నేహాలు పెంపొందుతాయన్నారు .ఈ కార్యక్రమంలో ఐపీసీలు దేవరశెట్టి సత్యనారా యణ, ఉప్పల వెంకటరమణ, క్లబ్ ఉపాధ్యక్షులు కందగట్ల బాలాజీ, ప్రధాన కార్యదర్శి శ్రీకాకోళ్ళ వెంకన్న, కోశాధికారి బ్రహ్మదేవర వేణు, సభ్యులు ఉప్పల సంతోష్, గుండా గోపి, వీరవెల్లి రఘునాథ్, మిట్టపల్లి యాదగిరి పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి అక్టోబర్ 3 ( విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి మండల కేంద్రంలో, గ్రామాల్లో దసరా వేడుకలు కనుల పండుగగా భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. ప్రతి గ్రామం దసరా ఉత్సవాలతో తాగి ఊగి సిందేసింది.
యువత ఆనందాలకు అవధులు లేవు. పట్టణాలకు వలస వెళ్లిన వారంతా పిల్లాపాపలతో గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాలలో కొత్త సందడి ఏర్పడింది. సాయంత్రం పెద్దలు చిన్నలు కొత్త బట్టలు ధరించి ఆలయాలలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు వెళ్లి జమ్మి పూజ నిర్వహించి ఆలయాలను సందర్శించి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గాంధీ జయంతి, అమ్మవారి నవరాత్రులు. గురువారం ఉపవాస దీక్షలు రోజునే దసరా పండగ రావడంతో మందు ప్రియులు, నాన్ వెజ్ ప్రియులను నిరుత్సాహపరిచింది.
భువనగిరి పట్టణంలో పలుచోట్ల రావణ దహన కాండ కార్యక్రమాలు జరిగాయి. రామ్ తడాక్ భక్త భజన మండలి వద్ద ఏర్పాటుచేసిన రావణ దహన కాండ కార్యక్రమా న్ని ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞానంపై జ్ఞానానికి. చెడుపై మంచికి విజయ చిహ్నం ఈ పవిత్రమైన దసరా పండుగ అని అభివర్ణించారు.
దుర్గాదేవి నవరాత్రుల దీవెనలు. శ్రీరాముని ధర్నా విజయ స్ఫూర్తి. శుభానికి ప్రతిగా పూజించే జమ్మి ఆకుల పవిత్రత ఇవన్నీ ప్రజల జీవితాల్లో విజయాన్ని కల్పించి సంతోషాన్ని సిరిసంపదలను అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం పట్టణంలో పలుచోట్ల జరిగిన దసరా ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. రామ్ తడాఖ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహన కాండ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన డిజె సౌండ్ సిస్టం పాటలకు యువత సిందేసి చించి వేశారు.
సూర్యాపేట..
సూర్యాపేట, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నం టాయి. పలు ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కళకళలాడాయి. ఈ సందర్భంగా ఆయుధపూజ, నూతన వాహన పూజలు, చిన్నారుల పటాకుల మోతలు ,పిండివంటలతో కుటుంబ సభ్యుల, బంధువులతో గ్రామాలన్నీ కళకళలాడాయి.
సాయంత్రం వేళ ప్రజలు కొత్త బట్టలు ధరించి వివిధ ఆలయాలను దర్శించుకొని శమీ పూజలు చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శమీ పూజకు భక్తులు బారులు తీరారు. ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వెళ్లి శమీ పూజలో పాల్గొని జమ్మి చెట్టుతో పాటు స్థానికంగా అన్ని దేవాలయాల వారు ఏర్పాటుచేసిన ఉత్సవిగ్రహా దేవత మూర్తులను దర్శించుకున్నారు.
సాంప్రదాయ పద్ధతిలో శమీ మంత్రం తో రూపొందించిన కరపత్రాలపై భక్తులు తమ కోరికలు రాసుకొని జమ్మి చెట్టుకు కట్టారు. దసరా రోజున పాలపిట్ట చూడటం అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో అక్కడ ఏర్పాటుచేసిన పాలపిట్ట కేంద్రాల వద్ద జనం బారులు తీరి తిలకించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సునీత దంపతులు, తెలంగాణ పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగు లింగ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జుట్టుకొండ సత్యనారాయణ లు తదితరులు దసరా ఉత్సవాలలో పాల్గొనీ ప్రత్యేక పూజలు చేశారు.
మున్నూరు కాపు సంఘంలో ..
ఆలేరు, అక్టోబర్ 3 (విజయ క్రాంతి) ఆలేరు పట్టణంలో చెడుపై మంచి గెలుపు కొరకు దసరా పండుగ సందర్భంగా మున్నూరు కాపు సంఘంలో విజయదశమి జమ్మి చెట్టు పూజ జరిగింది, ఇట్టి కార్యక్రమంలో మున్నూరు కాపు అధ్యక్షుడు ఎలగల అంజయ్య మాట్లాడుతూ చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని అన్నారు, సంఘ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరు పట్టణ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తోట మల్లయ్య, మైదానం ఆంజనేయులు, ఎలగల స్వామి, చిరిగే శ్రీనివాస్ ,రాంబాబు, కోశాధికారి, పత్తి రాములు, ఎలగల కృష్ణ, పోరెడ్డి ప్రసాద్, ఎలగల మహేందర్, పంతం కృష్ణ, ఎలగల శివ, వెలగల పాపయ్య, సోమిశెట్టి మహేందర్, ఎలగల కుమారస్వామి, జూల శ్రీధర్, ఏలగల రాజు, మణికొండ బాలరాజ్, ఏలగల బాలరాజ్, గూడూరు శ్రీనివాస్, పూల హనుమంత్, అల్లం పూజ లింగం, భాశెట్టి రమేష్, ముష్క శ్రావణ్ కుమార, చింతపండు రాము మరియు తదితరులు పాల్గొన్నారు.
అలాయ్ బలాయ్‌లో పాల్గొన్న బండ్రు శోభారాణి, విమలక్క..
ఆలేరు, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): ఆలేరు పట్టణానికి చెందిన బండ్రు శోభారాణి మరియు విమలక్కలు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం దసరా పండుగ అనంతరం ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరిగే ఈ కార్యక్రమంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం మన తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ
తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తున్నాను, దత్తాత్రేయకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బండ్రు భాస్కర్, కొల్లూరు రాజయ్య, జెల్ల బిక్షపతి, దడిగే ఇస్తారు, వంగపల్లి అంజయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.