04-10-2025 12:00:00 AM
ఉత్సవాల్లో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు
ఎల్బీనగర్, అక్టోబర్ 3 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో దసరా పండుగ సంబురాలు అంబరాన్ని తాకాయి. చంపాపేట, హస్తినాపురం, గడ్డిఅన్నారం, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, లింగోజిగూడ, ఆర్కేపురం డివిజన్లలో గురువారం, శుక్రవారం దసరా పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి.
స్థానికంగా జరిగిన ఉత్సవాల్లో కార్పొరేటర్లు శ్రీవాణి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రంగా నర్సింహగుప్తా, పవన్ కుమార్, చింతల అరుణా సురేందర్ యాదవ్, నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వర రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, రాధా ధీరజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. చైతన్యపురి డివిజన్ ప్రకాష్ నగర్ లో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్ గణేష్ టెంపుల్ లో శ్రీ దుర్గామాత అమ్మవారిని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ కుమార్, శ్రీనివాస్ శర్మ, సురేష్ కుమార్, శంకర్ ఉన్నారు. హయత్ నగర్ గ్రామంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హయత్ నగర్ కాస్ బాగ్ వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలకు తరలివెళ్లారు. హయత్ నగర్ లో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించే బొడ్రాయి పండుగలో హయత్ నగర్ గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మన్సూరాబాద్ డివిజన్ దుర్గా నగర్ కాలనీలో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
ఘట్ కేసర్..
ఘట్ కేసర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దసరా పండుగను ఉమ్మడి ఘట్ కేసర్ మండల ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. దసరా సందర్భంగా ఆయా ప్రాంతాలలో రావణదహనం చేశారు. ఉదయం నుంచే ప్రజలు గ్రామాలలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు.
సాయంత్రం నూతన వస్త్రాలు ధరించి దసరా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఘట్ కేసర్ గురుకుల్ క్రీడా మైదానంలో జనచైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకలల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. గురుకుల్ లో జనచైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ దంపతులు జమ్మిచెట్టుకు పూజలు జరిపి దసరా వేడుకలను ప్రారంభించారు.
ఈవేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొని భారీగా బానాసంచా కాల్చి సంబురాలు జరుపుకుని రావణదహనం చేశారు. అనం తరం జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్ర మంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న బందువులు, స్నేహితులను అలింగనం చేసుకుంటూ జమ్మిఆకును చేతిలో అందించి దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతల మండపాల వద్దకు వెళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ వేడుకలు ప్రశాం తంగా ఘనంగా జరగడానికి అన్ని విధాలా సహకరించిన ప్రజలు, పెద్దలు, పోలీసులు, పలు యువజన సంఘాల సభ్యులకు మాజీ సర్పంచ్ యాదగిరియాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సద్దుల బతుకమ్మ, దసరా పండగల ఏర్పాట్లను ఘనంగా చేసిన మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్‌కు పలు యువజన సంఘాలు, మహిళలు, జనచైతన్య సేవాసమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా రాజ కీయ పార్టీల నాయకులు ప్రజలకు దసర శుభాకాంక్షలు తెలియజేశారు.
రంగారెడ్డిలో..
రంగారెడ్డి, న్యూస్ నెట్‌వర్క్, అక్టోబర్ 3: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని పల్లెలన్నీ పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ, వ్యాపారిత్య వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా దసరా పండుగకు సొంత గ్రామా లకు తరలివచ్చారు. వేడుకలో భాగంగా బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజ నాలు చేశారు. అనంతరం ప్రజలంతా నూతన వస్త్రాలను ధరించి సాయంత్రం పాలపిట్ట దర్శనం చేసుకొని, ఆంజనేయ స్వామి ఆలయంలో జమ్మికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి అలాయ్ బలై తీసుకున్నారు.
విజయదశమి పురస్కరించుకొని రావణ దహనం కార్యక్రమం ఆయా గ్రామా ల లో కన్నుల పండుగ నిర్వహించారు. జిల్లాలోని ఆమనగల్, షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీం పట్నం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో అంబరానంటాయి. వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరల వచ్చి వేడుకలను తిలకించారు. స్థానిక పోలీసులు ఎక్కడ శాంతిభద్రతలకు లోటు కలవకుండా చర్యలు తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు స్థానిక ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 3: నియో జకవర్గంలో దసరా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల పరిధిలలో గురువారం, శుక్రవారం దసరా పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా డీజీపీ హోదాలో శశిధర్ రెడ్డి సొంత గ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో ఆయన రాకతో గ్రామప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. డీజీపీ గ్రామానికి రావడం అర్భటమైతే, మన గ్రామం నుంచి డీజీపీ స్థాయికి ఎదిగారన్న ఆనందంతో గ్రామం మురిసిపోయింది. ప్రతియేటా జరిగే దసరా వేడుకలు ఒకెత్తయితే ఈ సారి జరిగిన దసరా వేడుకలు గ్రామస్థులలో నూతనోత్సాహం తీసుకొచ్చింది.
డీజీపీ కలిసిన మర్రి నిరంజన్ రెడ్డి
విజయదశమి సందర్భంగా టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.