22 August, 2026 | 5:21 PM

జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి

22-08-2026 03:39 PM

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే 

గంభీరావుపేట, ఆగస్టు 22( విజయ క్రాంతి): ప్రజలకు చేరువగా ఉండి జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు సిబ్బందికి సూచించారు. శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, రికార్డులు, పెట్రోలింగ్, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఆధునిక సాంకేతికతతో కేసులు ఛేదించాలని ఆదేశించారు. గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్ పెంచాలని, డయల్ -112కు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు