26 June, 2026 | 1:48 AM

సమగ్ర ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలి

26-06-2026 12:00 AM

కొండపాక, జూన్ 25: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఇంటింటి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో గురువారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికి బిఎల్‌ఓ లు జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి వచ్చి ఎన్నుమరేషన్ ఫారాలు ఇస్తారని, ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్నుమరేషన్ ఫారాన్ని నింపి సమర్పించాలని, బి ఎల్ ఓ లకు  బి ఎల్ ఏ లు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, సరియైన పత్రాలతో ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు.

మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలోని ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ  (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తహసీల్దార్ మల్లికార్జున్, బి ఎల్ ఓ లు తదితరులు ఉన్నారు.