అధ్యక్ష పదవులు కోసం.. ఆశల పల్లకీలో
రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా మారింది. ఆయా పార్టీలకు అధ్యక్షులున్నా.. పూర్తిస్థాయిలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొన్నదనే టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ బీఆర్‌ఎస్ చీఫ్‌గా ఉన్నారు. అయితే రెండు జాతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు పార్టీ పదవులు, ప్రభుత్వాల్లో కీలకంగా ఉండటంతో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలకు అందుబాటులోకి రావడం లేదు.
ఇక బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కనీసం పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ అందుబాటులోకి వస్తే క్యాడర్‌లో బలం పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా అని బోలెడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల బాధ్యతలను కొత్తవాళ్లకు ఇవ్వకుండా.. ఇంకెన్ని రోజులు దాగుడుమూతలు ఆడుతారోనని సెటైర్లు వినిపిస్తున్నాయి. కొత్తవాళ్లు ఆశలతో ఎదరుచూడటమే తప్ప.. బాధ్యతలు అప్పగించడం లేదనే నిట్టూర్పును వ్యక్తం చేస్తున్నారు.






