31 August, 2026 | 1:03 PM

ద్వాదశ రాశిఫలాలు

09-06-2024 02:23 AM

09-.06.-2024 నుండి 15.0-6.2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం:-

ఈ వారం గ్రహస్థితి శుభంగా ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచన కలుగుతుంది. శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. యువతీ యువకులకు మంచి వివాహ సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొం దుతారు. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం: 

ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేదు. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్త అవసరం. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. శ్రమాధిక్యం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. నిరుత్సాహం కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు--. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.- మొత్తం మీద ఈ వారం ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది

మిథునం:

ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పనులు మందకొడిగా సాగుతాయి. అధిక ధన వ్యయం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. భూతగాదాలలో కొన్ని పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు చదువు లలో ముందు ఉంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం:

ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూ లంగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విహార యాత్ర లు చేస్తారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు మర్యాదలు, సన్మానాలు జరుగుతా యి. అందరితో ఆనందంగా ఉంటా రు. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువులు కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 80 శాతం అనుకూ లత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం:

ఈ వారం గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నమ్మి నవారు చెడు చేస్తారు. అవమానాలకు గురవుతారు. ప్రయాణాలవల్ల ఖర్చు పెరుగుతుంది. అలసిపోతారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివా హ ప్రయత్నాలు లాభించవు. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపా రస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య:

ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. నూతన సామాగ్రి కొనుగోలు చేస్తారు. సంతోషకర వార్తలు వింటారు. యువతీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల:

ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విషయక శుభవార్తలు వింటారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రమించవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం:

ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆరోగ్యం విషయమై కొంత ఇబ్బంది ఉంటుంది. ధన వ్యయం కలుగుతుంది. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు చేస్తారు. పట్టుదలతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. మనసులో అశాంతి ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువులలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్లకు గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు:-

ఈ వారం గ్రహస్థితి మంచిగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు. కళాకారులకు సన్మానం జరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. యువతీ యువకులకు మంచివారితో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలి స్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతు లు లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం:--

ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా ఉంది.  ధన వ్యయం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధువులకు మీపై అసూ య కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం జరుగుతుంది. -విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం:

ఈ వారం గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. మిత్రులతో విరోధం కలుగుతుంది. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ధన వ్యయం అవుతుంది. కొత ్తపనులు ప్రారంభిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం:

ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ధన వ్యయం అవుతుంది. బంధువులతో భేదాలు కలుగుతాయి. చేసే పనులలో సంతృప్తి ఉండదు. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. శుభ కార్యాల ప్రయత్నాలు మొదలుపెడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపా రస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.