ఆరోగ్య కేంద్రాలు.. అంగన్వాడి సెంటర్లు
తల్లి, బిడ్డలకు సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నాం
అమ్మ మాట- అంగన్వాడి బాట కార్యక్రమంలో డిడబ్ల్యువో జరీనా బేగం
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తల్లి, బిడ్డల సంక్షేమం కోసం అంగన్వాడి కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం(Mahabubnagar District Welfare Officer Zarina Begum) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బండ్ల గిరిలో నిర్వహించిన అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం(Amma Mata-Anganwadi Bata Program)లో జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం హాజరై మాట్లాడారు. వయసుకు తగ్గ బిడ్డ ఎదుగుదల ఉండాలని, లేని ఇళ్ల ఇందుకు కారణాలను విశ్లేషించి అవసరమైన పోషకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు అంగన్వాడి కేంద్రాలు వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు తాగించాలని, రోగ నిరోధక శక్తి ముర్రు పాలలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టి హెచ్ ఆర్, హెచ్ సి ఎం ద్వారా అందించే పౌష్టికాహారం గురించి వివరించారు.






