ఆధార్ అప్‌డేట్ ఉంటేనే.. ఈ-కేవైసీ..!
- ఈ కేవైసీ చేయకుంటే రేషన్ బంద్
- ఆందోళనకు గురవుతున్న రేషన్ లబ్ధిదారులు
- రేషన్ షాపులకు పరుగులు
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): రేషన్ లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ చేయించాలని పౌరసరఫరాలలో శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డీలర్ల వద్ద ఈ-కేవైసీ నమోదు చేసిన వారికి మాత్రమే ఆగస్టు మాసంలో సర కులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబు తుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్తున్నారు. అయితే కొంతమంది లబ్దిదారులకు.. ఆధార్ కార్డు అప్ డేట్ లేకపోవడంతో ఈ-కేవైసీ నమోదు కావడం లేదు.
కార్డు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు విధిగా ఈ-కేవైసీ చేసుకోవాలనే ప్రభుత్వం ఆదేశాలు జారిచేసింది. కొంతమంది లబ్ధిదారులకు ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడంతో ప్రక్రియ ముందుగు సాగడం లేదు. 10 సంవత్సరాల కిందట పొందిన ఆధార్ కార్డు లను అప్డేట్ చేసుకోకపోవడంతో.. చాలామంది లబ్ధిదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి.
ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్రలు 24 గంటల సమయంలో అప్డేట్ అవుతుంది. ఒక్కోసారి వారం రోజుల పాటు సమయం కూడా పడుతుం దని ఆధార్ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. * కామారెడ్డి జిల్లాలో ఆధార్ కేంద్రాలు తక్కువగా ఉండ టంతో.. ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్ అప్డేట్ లేకపోవడంతో అప్డేట్ కోసం వేరే మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆధార్ అప్డేట్ పూర్తికాకపోతే రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగి పోయే ప్రమాదం ఉంది.
గడువు సమీపిస్తున్ననేపథ్యంలో వీలైనంత త్వరగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు ఊరికి దూరంగా చదువుల నిమిత్తం వెళ్లినవారు.. పట్టణాలు, వసతి గృహాల్లో ఉంటున్నారు. ఆ విద్యార్థులు ఈ-కేవైసీ కోసం ఇంటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది.
వారి పేర్లు తొలగిపోతాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారికి ఫోన్లు చేసి ఇంటికి వచ్చి ఈ-కేవైసీ చేసుకోవాలని కోరుతున్నారు. గడువు సమీపిస్తుండడంతో లబ్ధిదారులు ఈ కేవైసీ కోసం ఆందోళన చెందుతున్నారు. మరోసారి పొడిగిస్తారా లేదా అనేది ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ కేవైసీ చేసుకుని వారికి ఆగస్టు నుంచి రేషన్ సరుకులు నిలిచిపోనున్నాయి. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.






