విద్యార్థులకు జ్యోతిష్మతి చేయూత!
- బీటెక్ ప్రథమ స్టూడెంట్స్ కు రూ.18 వేల స్కాలర్షిప్ చెక్కులు
- విద్యార్థులకు ఆర్థిక భరోసా
కరీంనగర్, జూలై 28 (విజయ క్రాంతి): ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని, సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలను మనం చూసాం. కానీ ఎందుకు విరుద్ధంగా తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందిస్తూ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల ఆదర్శంగా నిలుస్తున్నది. విద్యార్థుల భవిష్యత్తుకు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆర్థిక చేయూతనందిస్తున్నది.
విద్యా ర్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో జ్యోతిష్మతి కళాశాల ముంద డుగు వేసింది. కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు శాలిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 18,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తున్నది. 725 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సహాయం విద్యార్థులు తమ ఉన్నత విద్యను ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా కొనసాగించడంతో పాటు, విద్యకు సంబంధించిన ఇతర అవసరాలు, ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతున్నది.
- పేద విద్యార్థికి బీటెక్ లో ఉచిత ప్రవేశం...
రాజన్న సిరిసిల్ల జిల్లా అవునూర్ గ్రామానికి చెందిన విద్యార్థి బండి వికాస్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య బి టెక్ ఫీజు చెల్లించేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో ఆయన తల్లి ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవలే ఆత్మహత్య యత్నానికి పాల్పడటంకుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే వికాస్ సంకల్పాన్ని తెలుసుకున్న జ్యోతిష్మతి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. విద్యార్థి కుటుంబ పరిస్థితిని పరిశీలించిన అనంతరం, బండి వికాస్ కు జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత విద్య మధ్యలో ఆగిపోకూడదు..
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ వి ద్యార్థి ఉన్నత విద్య మధ్యలో ఆగిపోకూడదు. పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థులు త మ అమూల్యమైన సమయాన్ని వృథా చేయకుండా, నాలుగు సంవత్సరాల వి ద్యాభ్యాసాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలోని తదుపరి నలభై సంవత్సరాలకు బలమైన పునాది వేసుకోవాలి.
జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు






